ఆందోళన బాటలో జూనియర్ డాక్టర్లు
హైదరాబాద్: ఎంబిబియస్ కోర్సు కాలపరిమితి పెంపును నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు బుధవారంనాడు ఆందోళనకు దిగారు. ఎంబిబియస్ కోర్సు కాలపరిమితిని ఆరున్నర ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని నిరసిస్తూ తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే ఆందోళనలు ప్రారంభమయ్యాయి. బుధవారంనాడు రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు.
సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్లు కేంద్రమంత్రి అన్బుమణి రాందాస్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వం కొత్త నిబంధనలను ఉపసంహరించుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని వారు చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం నాలుగున్నర ఏళ్లు ఎంబిబియస్ కోర్సు చదివిన తర్వాత ఒక ఏడాది పాటు హౌస్ సర్జనుగా వివిధ ఆస్పత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం మరో ఏడాది వారు జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications
