టిడిపిలో చేరినందుకు సిగ్గా?: కెసిఆర్


హైదరాబాద్: నిజాంపై తాను చేసిన ప్రకటనను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సమర్థించుకున్నారు. చరిత్ర తెలియకే తనను విమర్శిస్తున్నారని ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధికిచ్చిన ఇంటర్వూలో అన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని, హుస్సేన్ సాగర్ ను ఎవరు కట్టించారంటే ఏం చెబుతారని ఆయన అడిగారు. తాను తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. రజాకార్ల దురాగతాలను తాను సమర్థించలేదని ఆయన వివరణ ఇచ్చారు.

దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఆరు టన్నుల బంగారం ఇచ్చి నిజాం ఆదుకున్నాడని ఆయన అన్నారు. తెలుగుదేశంలో చేరినందుకు చెన్నమనేని రాజేశ్వరరావు సిగ్గుపడుతున్నారా అని ఆయన చెన్నమనేని రాజేశ్వరరావు తనపై చేసిన ప్రకటనపై ప్రశ్నించారు. గాంధీని చంపిన గాడ్సేను సమర్థించే బిజెపిలో ఉన్న సిహెచ్. విద్యాసాగరరావు, దేశానికి స్వాతంత్ర్యమే రాలేదని చెప్పే సిపిఐలో ఉన్న సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణ తనను విమర్శించడమేమిటని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+