కెమెరా ముందు భయమేసింది: మాధురీ

ఢిల్లీ: చాలా రోజుల విరామం తర్వాత కెమెరా ముందు నిలబడడానికి భయమేసిందని ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ అన్నారు. తాను నటించిన ఆజా నాచ్ లే సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి వచ్చిన ఆమె బుధవారంనాడు ఆ మాట అన్నారు. సినిమా మొదటి షాట్ కోసం కెమెరా ముందు నిలబడ్డప్పుడు కాస్తా భయమేసిందని ఆమె అన్నారు.
రంగస్థలం, నాట్యాల ద్వారా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రచారం చేయడమే ఈ సినిమా ఉద్దేశమని ఆమె చెప్పారు. ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ మాధురీ దీక్షిత్ నటించిన ఆజా నాచ్ లే సినిమా చూడడానికి దుబాయ్ లో ఏకంగా ఒక థియేటరునే బుక్ చేసుకున్నాడట. హుస్సేన్ మాధరీ దీక్షిత్ వీరాభిమాని. ఆమెతో ఆయన ఒక సినిమా కూడా తీశారు.












Click it and Unblock the Notifications
