రబీలో 7 గంటల విద్యుత్: షబ్బీర్ అలీ


హైదరాబాద్: రబీలో వ్యవసాయానికి రోజుకు 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి బుధవారం సమీక్షించారు. సమీక్ష అనంతరం షబ్బీర్ అలీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పరిశ్రమలకు ఇబ్బంది కలగకుండా పట్టణ ప్రాంతాలకు నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేయనున్నట్లు ఆయన తెలిపారు.

విద్యుచ్ఛక్తి కొనుగోలుకు 2600 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన చెప్పారు. 2008-2009లో విద్యుత్ కొనుగోలుకు 2900 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కూడా ఆయన తెలిపారు. ఎత్తిపోతల పథకాలకు 81 మెగావాట్ల విద్యుత్తును కేటాయించినట్లు అయన చెప్పారు. 2009లో 11 ఎత్తిపోతల పథకాలకు 1059 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని అందిస్తామని, వీటి సమన్వయానికి ఒక నోడల్ అధికారిని నియమిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+