సిఎం కాన్వాయ్ వాహనం ఢీకొట్టి గార్డ్ కు గాయాలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కాన్వాయ్ లోని ఒక వాహనం దూసుకెళ్లి ఒక సెక్యూరిటీ గార్డును ఢీకొట్టింది. దీంతో సెక్యూరిటీ గార్డు బాల్ రెడ్డి కాలికి తీవ్రంగా గాయమైంది. దీంతో బాల్ రెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు.
లేక్ వ్యూ అతిధి గృహంలో బస చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ను కలిసేందుకు ముఖ్యమంత్రి వెళ్తున్న సమయంలో బుధవారంనాడు ఈ ప్రమాదం సంభవించింది. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి దిగ్విజయ్ సింగ్ వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
