స్వప్న ఆచూకీ దొరకలేదు: ఎసిపి
హైదరాబాద్: హైదరాబాదులోని ఎర్రగడ్డ ప్రాంతంలో గల బంజారా కాలనీ నుంచి మాయమైన స్వప్న ఆచూకీ దొరకలేదని సనత్ నగర్ ఎసిపి మాధవాచారి అంటున్నారు. స్వప్న కేసుకు సంబంధించిన వివరాలను రెండు రోజుల్లో వెల్లడిస్తామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. స్వప్నది కిడ్నాపా, అదృశ్యమా, ప్రేమపెళ్లా అనే విషయాన్ని ఛేదిస్తామని ఆయన చెప్పారు.
స్వప్న తిరుపతి వెళ్లి ప్రేమ వివాహం చేసుకుందని, తిరుపతిలో ఆమె పోలీసులకు చిక్కిందని వార్తలు వచ్చాయి. మంగళవారంనాడే పోలీసులు ఆమెను మీడియా ముందు ప్రవేశపెడతారని కూడా ప్రచారం జరిగింది. తన కూతురును కిడ్నాప్ చేశారని స్వప్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవరుపై అనుమానం వ్యక్తం చేస్తూ వారు ఫిర్యాదు ఇచ్చారు. స్వప్న ప్రేమ పెళ్లి చేసుకోవడానికి పారిపోయిందని వార్తలు రావడంతో ఆటో డ్రైవర్లు సనత్ నగర్ పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన స్వప్న తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
