దిగ్విజయ్ తో భేటీ మర్యాదపూర్వకమే: వైయస్
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ను తాను మర్యాదపూర్వకంగానే కలిశానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ ను ముఖ్యమంత్రి బుధవారంనాడు లేక్ వ్యూ అతిథి గృహంలో కలుసుకున్నారు. వారి మధ్య దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. తాము రాజకీయాల గురించి చర్చించలేదని ముఖ్యమంత్రి చెప్పారు.
ఉషా మెహ్రా కమిటీ నివేదిక అందిన వెంటనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చర్యలు తీసుకుంటామని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. వర్గీకరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని తాను దిగ్విజయ్ ని కోరినట్లు, దాంతో దిగ్విజయ్ ఆ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.












Click it and Unblock the Notifications
