బిల్లును సుప్రీంలో సవాల్ చేసిన వేణుగోపాల్
న్యూఢిల్లీ: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ పదవీ విరమణకు 65 ఏళ్ల వయోపరిమితిని విధిస్తూ పార్లమెంటులో ఆమోదించిన బిల్లును ఆ సంస్థ డైరెక్టర్ పి. వేణుగోపాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ విషయంలో పార్లమెంటు ఆమోదించిన బిల్లు దురుద్దేశంతో, వివక్షతో కూడిందని ఆయన తన పిటిషనులో విమర్శించారు.
గత రెండున్నరేళ్లుగా వేణుగోపాల్ తో విభేదాలతో కూరుకుపోయిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రాందాసు ఈ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఎయిమ్స్ డాక్టర్లు సమ్మెకు దిగారు. అనంతరం వారు సమ్మెను విరమించారు. ఈ సమ్మెపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మెకు దిగినవారి డిగ్రీలు రద్దు చేయాలని, వేతనాల్లో కోత విధించాలని మండిపడింది.












Click it and Unblock the Notifications
