లోక్ సత్తా అంబుడ్స్ మన్ కమిటీ


Jayaprakashహైదరాబాద్: పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణకు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అంబుడ్స్ మన్ కమిటీని వేశారు. ఈ కమిటీలో మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి కాకి మాధవరావు, జస్టిస్ రెడ్డప్ప రెడ్డి ఉంటారు. తెలంగాణకు చెందిన ఒక విశిష్ట న్యాయమూర్తిని కూడా ఈ కమిటిలో వేస్తామని జయప్రకాశ్ నారాయణ గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పార్టీ కమిటీలన్నింటినీ అంబుడ్స్ మన్ కమిటీ పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు.

అంబుడ్స్ కమిటీ వేయడం రాజకీయాల్లోనే సరికొత్త విధానమని ఆయన అన్నారు. పారదర్శకంగా ఉండడానికే ఈ కమిటీని వేసినట్లు చెప్పారు. కమిటీలోని వారికి రాజకీయాలతో ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడిని బ్యాలెట్ ద్వారా ఎన్నుకోనున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+