సుబ్రహ్మణ్యం, సరసాదేవి ఆస్తుల జప్తు
హైదరాబాద్: డిపెప్ కుంభకోణంలో సరసాదేవి, సుబ్పహ్మణ్యం ఆస్తులను జప్తు చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సర్వశిక్షా అభియాన్ మంత్రి హనుమంతరావు చెప్పారు. డిపెప్ కుంభకోణంలో సరసాదేవి, సుబ్రహ్మణ్యంల స్వాహా చేసిన సొమ్మును వసూలు చేస్తామని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కోర్టు నుంచి అనుమతి తీసుకొని వారిద్దరి అస్తులు వేలం వేస్తామని ఆయన చెప్పారు.
డిపెప్ కుంభకోణానికి సంబంధించి సిఐడి దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు. జస్టిస్ వెంకట్రామిరెడ్డి నివేదిక అందగానే దోషులపై చర్యలు తీసుకుంటామని, దోషులు ఎంత పెద్దవారైనా వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. సర్వ శిక్షా అభియాన్ అమలులో సమూల మార్పులు చేస్తామని, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రతి రూపాయికి లెక్క తేలే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. డిపెప్ కుంభకోణంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సిబ్బందిలోని సూరీడికి పాత్ర ఉన్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications
