మావోయిస్టుల మందుపాతరకు 13 మంది బలి
రాయపూర్: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టుల మందుపాతరకు గురువారంనాడు 13 మంది బలయ్యారు. ఛత్తీస్ ఘడ్ లోని దంతేవాడ జిల్లా కుంట పోలీసు డివిజన్ లోని బండ గ్రామం వద్ద మావోయిస్టులు మందుపారతతో కమెండో జీపును పేల్చివేశారు. ఈ జీపులో ప్రయాణిస్తున్న 13 మంది మరణించారు.
ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తుండగా మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. మృతుల్లో 10 మంది మిజోరాం పోలీసులు కాగా, ఇద్దరు గ్రామస్తులు, మరొకరు జీపు డ్రైవర్. మందుపాతర ధాటికి జీపు విడిభాగాలు అరకిలోమీటర్ పరిధిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకోవడానికి పోలీసులకు ఇబ్బంది అవుతోంది.












Click it and Unblock the Notifications
