ముంబయి ఇంటికి చేరుకున్న సంజయ్
ముంబయి: సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురువారం ఉదయం ముంబైలోని తన ఇంటికి చేరుకున్నారు. పూణేలోని ఎరవాడ జైలునుంచి ఆయన గురువారం ఉదయం విడుదలయ్యారు. ఈ సందర్భంగా పెద్దయెత్తున గుమిగూడిన అభిమానులకు ఆయన అభివాదం చేశారు. ఆ తర్వాత విమానాశ్రయం చేరుకుని చార్టర్ విమానంలో ముంబయి బయలుదేరి వచ్చారు.
సంజయ్ దత్ కు సుప్రీంకోర్టు బుధవారంనాడే బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ పత్రాలను సంజయ్ దత్ న్యాయవాదులు అందించే సరికి పొద్దు పోయింది. ఐదు లక్షల రూపాయలకు పూచీకత్తు కూడా సమర్పించారు. అయితే జైలు నిబంధనల ప్రకారం ఆయన బుధవారంనాడే విడుదల కావడానికి వీలు కాలేదు. దీంతో ఆయన గురువారం ఉదయం విడుదలయ్యారు. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో అక్రమాయుధాలను కలిగి ఉన్నందుకు సంజయ్ దత్ కు టాడా కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన ఎరవాడ జైలులో శిక్ష అనుభవించాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications
