స్వప్నది ప్రేమ వ్యవహారమే: కమీషనర్
హైదరాబాద్: హైదరాబాదులోని ఎర్రగడ్డ ప్రాంతంలో గల బంజారా కాలనీ నుంచి అదృశ్యమైన యువతి స్వప్నది ప్రేమ వ్యవహారమేనని సైబరాబాద్ పోలీసు కమీషనర్ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. స్వప్న కిడ్నాప్ జరగలేదని, ప్రేమ వ్యవహారంలోనే ఆమె అదృశ్యమైందని, ఇందుకు తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన చెప్పారు. అయితే స్వప్న ఆచూకీ ఇంకా లభించలేదని ఆయన చెప్పారు. స్వప్నను కిడ్నాప్ చేశారనే కోణం నుంచి తాము దర్యాప్తు జరిపామని, ఆమెది కిడ్నాప్ కాదని దర్యాప్తులో తేలిందని ఆయన చెప్పారు.
స్వప్నను ఇంటి దగ్గరి నుంచి ఒక ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వప్న మహేందర్ అనే యువకుడిని ప్రేమించిందని, ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు ఆ యువకుడిని బస్తీ నుంచి పంపించి వేశారని, అయినా వారిద్దరి ప్రేమ వ్యవహారం కొనసాగుతూనే వచ్చిందని తెలుస్తోంది. ఆ యువకుడితోనే స్వప్న తిరుపతి వెళ్లి ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications
