తస్లీమా గృహ నిర్బంధంలో ఉన్నట్లే: సిపిఐ
న్యూఢిల్లీ: వివాదాస్పద బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపుగా గృహ నిర్బంధంలో ఉందని సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్ గప్తా అన్నారు. న్యూఢిల్లీలోని ఒక అతిథి గృహంలో ఆమె ఉందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే ఆ ప్రదేశం గురించి చెప్పడానికి ఆయన నిరాకరించారు. బుధవారంనాడు ఫోనులో ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించానని, ఆమెతో మాట్లాడిన మొదటి రాజకీయ నాయకుడిని తానేనని ఆయన చెప్పారు.
తన కదలికలపై ఆంక్షలు విధించారని, బయటకు వెళ్లడానికి అనుతించడం లేదని ఆమె తనతో చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఇతరులను బాధ పెట్టే పనులేవీ తస్లీమా చేయకూడదని, తస్లీమా భద్రతకు అన్ని చర్యలూ తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రకటనను ఆయన తప్పు పట్టారు. గత మూడేళ్లుగా తస్లీమా కోల్ కత్తాలో ఉంటున్నారని, ఆమె ఈ కాలంలో ఏ విధమైన రాజకీయాల్లో పాల్గొనలేదని ఆయన చెప్పారు. ఆమె రాసిన లజ్జ నవల వివాదంగా మారింది.












Click it and Unblock the Notifications
