చలో ఢిల్లీ: అఖిల పక్ష రైతు సంఘం నేతలు
హైదరాబాద్: వరికి మద్దతు ధరపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఢిల్లీకి అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని తీసికెళ్లకపోతే తామే చలో ఢల్లీ కార్యక్రమాన్ని చేపడతామని అఖిల పక్ష రైతు సంఘం నాయకులు చెప్పారు. వారంలోగా ఈ విషయంపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని వారన్నారు. ముత్యంరెడ్డి, రామకృష్ణ తదితరులతో కూడిన అఖిల పక్ష రైతు సంఘం ప్రతినిధులు ఆదివారం ముఖ్యమంత్రిని కలిశారు.
తమ డిమాండుపై ముఖ్యమంత్రి ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని వారు డిమాండ్ చేశారు. వరికి వేయి రూపాయల మద్దతు ధరను ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని వారు చెప్పారు. రైతు సంఘాల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
