సంప్ లో దిగి 3గురు నాట్కో కార్మికుల మృతి
హైదరాబాద్: సంప్ లో దిగిన ముగ్గురు హైదరాబాదులోని సనత్ నగర్ ప్రాంతంలో గల నాట్కో కర్మాగారం కార్మికులు ఆదివారం మృతి చెందారు. కంపెనీలోని సంప్ లో ముగ్గురు కార్మికులు ఒకరి తర్వాత ఒకరు దిగారు. ముందు ఒక కార్మికుడు దిగాడు. అతన్ని రక్షించడానికి మొదట ఒక కార్మికుడు దిగాడు. ఆ తర్వాత మరో కార్మికుడు దిగాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు దిగిన కార్మికులను సంప్ పొట్టన పెట్టుకుంది.
మృతుల కుటుంబసభ్యులను హైదరాబాదులోని ఖైరతాబాద్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన నాట్కో సంస్థ యాజమాన్యాన్ని కోరారు. అందుకు యాజమాన్యం అంగీకరించింది. మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయలేసి నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు నాట్కో యాజమాన్యం ప్రకటించింది.












Click it and Unblock the Notifications
