పంతూ నాయక్ హత్యలో యాదగిరి కీలక పాత్ర
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్ మండల పరిషత్ అధ్యక్షుడు పంతూ నాయక్ హత్య కేసులో కేసులో నల్లగొండ జిల్లా మావోయిస్టు దళ సభ్యుడు కావలి యాదగిరి అలియాస్ పాండు కీలక సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. పంతూ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి హోంమంత్రి కె. జానారెడ్డి వచ్చారు. తమ ఉనికిని చాటుకోవడానికే మావోయిస్టులు పంతూ నాయక్ ను హత్య చేశారని ఆయన విమర్శించారు. మావోయిస్టుల చర్యలను ధీటుగా ఎదుర్కొంటామని ఆయన చెప్పారు.
గిరిజన నాయకుడిని మావోయిస్టులు హత్య చేయడం అమానుషమని ఆయన అన్నారు. పంతూ నాయక్ హత్య నక్సల్స్ పనేనని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఆయన చెప్పారు. పంతూ నాయక్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పంతూ నాయక్ కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి పరామర్శించారు.












Click it and Unblock the Notifications
