ఏప్రిల్ 1నుంచి రు.2 కిలో బియ్యం: వైయస్
హైదరాబాద్: వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్నిఅమలు చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారంనాడు ఆయన వికలాంగుల నుంచి సచివాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
వికలాంగులకు ఆర్థిక సాయం చేస్తామని ఆయన చెప్పారు. వారికి ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉభయగోదావరి, చిత్తూరు, నల్గొండ జిల్లాల్లో 8 లక్షల రూపాయల విలువ చేసే టాక్లిన్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారంనాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.












Click it and Unblock the Notifications
