ఏడుగురు పిల్లల మృతి: సూపరింటిండెంట్ ఘెరావ్
హైదరాబాద్: నీలోఫర్ పిల్లల అస్పత్రిలో వైద్య సేవలు అందక ఏడుగురు పిల్లలు మృతి చెందారు. సోమవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో మరో పసిపాప కన్నుమూసింది. మజ్లీస్ శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్, ఆయన అనుచరుల దాడికి నిరసనగా జూనియర్ డాక్టర్లు హైదరాబాదులోని నాంపల్లి వద్ద ధర్నాకు దిగారు. పిల్లల మృతితో తల్లిదండ్రులు ఆస్పత్రి సూపరింటిండెంట్ ను ఘెరావ్ చేశారు. అక్కడే ఉన్న వివిధ పార్టీల రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని సూపరింటిండెంట్ అంటున్నారు. స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి వచ్చి ఆఫ్సర్ ఖాన్ పై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చే వరకు సమ్మెను విరమించబోమని జూనియర్ డాక్టర్లు మొండికేశారు. సెక్యూరిటీని తగిన విధంగా ఏర్పాటు చేస్తామని ఆరోగ్య మంత్రి గల్లా అరుణకుమారి చెప్పారు. ఘటనపై విచారణ చేయిస్తామని కూడా ఆమె చెప్పారు. జూనియర్ డాక్టర్లను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఔట్ పోస్టు ఏర్పాటు చేస్తామని గల్లా అరుణకుమారి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.












Click it and Unblock the Notifications
