నారాయణాద్రిలో శవం 16 ఏళ్ల యువతిది
హైదరాబాద్: నారాయాణాద్రి ఎక్సుప్రెస్సులో లభించిన మృతదేహం 16 ఏళ్ల యువతిదని ఫోరెన్సిక్ పరీక్షల్లో బయటపడింది. యువతిని హత్య చేసి తగులబెట్టే ప్రయత్నంలోనే నారాయణాద్రి ఎక్సుప్రెస్సులో మంటలు లేచి బోగీలు దగ్ధమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బోగీలో మహిళ మృతదేహం బయటపడగానే ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు.
సంఘటనా స్థలంలో రక్తపు మరకలు కనిపించాయి. పగిలిన గాజులు, కమ్మలు కూడా బయటపడ్డాయి. ఆగి ఉన్న బోగీల్లో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం లేదని రైల్వే అధికారులంటున్నారు. నారాయాణాద్రి ఎక్సుప్రెస్సుకు ఆకతాయిలు నిప్పు పెట్టి ఉంటారని పోలీసులు మొదట భావించారు. మహిళ శవం బయట పడడంతో దర్యాప్తును మరో కోణం నుంచి వేగవంతం చేశారు.












Click it and Unblock the Notifications
