నీలోఫర్ వైద్యుల సమ్మె నోటీసు
హైదరాబాద్: నీలోఫర్ వైద్యులు సోమవారం ఒక రోజు సమ్మె నోటీసు ఇచ్చారు. 24 గంటల లోగా జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించుకుంటే సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. నీలోఫర్ జూనియర్ డాక్టర్లకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) మద్దతు ప్రకటించింది. అలాగే ప్రభుత్వ వైద్యులు కూడా తమ మద్దతు తెలియజేశారు. జూనియర్ డాక్టర్లపై దాడికి నిరసనగా రేపు (మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించాలని ప్రభుత్వ వైద్యులు నిర్ణయించారు.
తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని జూనియర్ డాక్టర్లు విమర్శిస్తున్నారు. మజ్లీస్ శాసనసభ్యులపై ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని వారంటున్నారు. జూనియర్ డాక్టర్లకు బిజెపి, తెలుగుదేశం తదితర పార్టీలు మద్దతు ప్రకటించాయి. మజ్లీస్ పట్ల ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. తస్లీమా నస్రీన్ పై దాడి ఘటనలో కూడా ప్రభుత్వం మజ్లీస్ పై చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
