రైతు సమస్యలే ఎజెండా: చంద్రబాబు
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో రైతు సమస్యలే ప్రధాన ఎజెండా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీ సమావేశంలో ఆయన సోమవారం ఆ విధంగా అన్నారు. రైతు సమస్యలు ఎక్కడ ఉంటే తమ పార్టీ అక్కడ ఉంటుందని ఆయన అన్నారు.
కేంద్రం మెడలు వంచైనా సరే పంటలకు గిట్టుబాటు ధర ఇప్పిస్తామని ఆయన అన్నారు. వరికి వేయి రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని ఆయన విమర్శించారు. తాము అధికారంలో వస్తే వికలాంగులకు వేయి రూపాయల పింఛను ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
