నారాయణాద్రిలో మంటలు: మహిళ సజీవదహనం
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో ఆగి ఉన్న నారాయణాద్రి ఎక్సుప్రెస్సులో సోమవారం ఉదయం మంటలు లేచాయి. ఈ మంటల్లో నాలుగు బోగీలు దగ్ధమయ్యాయి. ఒక మహిళ సజీవ దహనమైంది. నారాయణాద్రి ఎక్సుప్రెస్సు ఆదివారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో సికింద్రాబాదులోని రైల్వై యార్డుకు చేరుకుంది. దాంట్లో మంటలు లేచాయి. మంటలను చూసిన స్కూటర్ పార్కింగ్ నిర్వాహకులు పోలీసులకు విషయం తెలియజేశారు. దాంతో అగ్నిమాపక దళాలు రంగప్రవేశం చేసి మంటలను ఆర్పేశాయి.
ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమీ సంభవించలేదని తొలుత భావించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని భావించారు. దుండగులు ఈ చర్యకు పాల్పడి ఉంటారా అనే దిశగా కూడా పోలీసులు దృష్టి పెట్టారు. అయితే అనూహ్యంగా మహిళ సజీవదహనమైన విషయం బయటకు వచ్చింది. దీంతో ఆ మహిళను హతమర్చే ప్రయత్నంలోనే బోగీలు తగులబడి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. నారాయణాద్రి ఎక్సుప్రెస్సు ప్రమాదం వల్ల దక్షిణ మధ్య రైల్వేకు 25 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై విచారణకు దక్షిణ మధ్య రైల్వే ఆదేశించారు.












Click it and Unblock the Notifications
