మంత్రి రాజ్యలక్ష్మిని అడ్డుకున్న వికలాంగులు
హైదరాబాద్: హైదరాబాదులోని రవీంద్రభారతి వద్ద మంత్రి ఎన్. రాజ్యలక్ష్మిని వికలాంగులు సోమవారంనాడు అడ్డుకున్నారు. ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమెను వికలాంగులు ఘెరావ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వికలాంగులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పిందని ఆరోపిస్తూ వికలాంగులు సోమవారం ఆందోళనకు దిగారు. తమ సమస్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తప్పారని వారు ఆరోపిస్తున్నారు.
తమ డిమాండ్లపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వికలాంగులు సోమవారం హైదరాబాదులోని వియస్టీ నుంచి ఆర్టీసి క్రాస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ రాస్తారోకో నిర్వహించారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి మాట తప్పారని వికలాంగు హక్కుల పోరాట సమితి గౌరవాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని వికలాంగులు ముట్టడించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications
