వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హనీఫ్ అస్ట్రేలియా వెళ్లొచ్చు

By Staff
|
Google Oneindia TeluguNews


మెల్బోర్న్: ఆస్ట్రేలియా తిరిగి వెళ్లేందుకు భారతీయ వైద్యుడు మొహమ్మద్ హనీఫ్‌కు ఇక్కడి ఫెడరల్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్రిటన్ తీవ్రవాద చర్యలతో సంబంధాలున్నాయనే తప్పుడు ఆరోపణలతో ఆస్ట్రేలియాలో అరెస్టయిన హనీఫ్‌ను అక్కడి ప్రభుత్వం బలవంతంగా భారత్ పంపివేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న వీసా రద్దు నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. దీంతో బ్రిటన్ బాంబు పేలుళ్లకు సంబంధించి ఈ ఏడాది జులైలో 12 రోజుల పాటు జైళ్లో గడిపిన హనీఫ్ ఖాతాలో మరో విజయం చేరింది.

ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టులోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తాజాగా హనీఫ్ వీసా రద్దు కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. నిరుడు హనీఫ్‌కు జారీ చేసిన వర్క్ వీసాను పునరుద్ధరించాలని ఇంతకుముందు న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌‌ను కూడా తాజాగా ఫెడరల్ కోర్టు కొట్టివేయడంతో హనీఫ్‌ ఆస్ట్రేలియా వర్క్ వీసా పునరుద్ధరించడానికి మార్గం సుగమమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X