వైయస్ జగన్ జన్మదిన సందడి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందడి చోటు చేసుకుంది. జగన్ జన్మదినం సందర్భంగా జగన్ చారిటుబుల్ ట్రస్టు శుక్రవారం ట్యాంకుబండ్ వద్ద మహా శాంతి యాత్ర నిర్వహించింది. 23 జిల్లాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ట్రసు అధిపతి మధుసూదన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పది వేల రక్త దాన శిబిరాలు జరిగినట్లు ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు.
సేవాభావంతోనే తాను ఈ పనులన్నీ చేస్తున్నట్లు ఆయన చెప్పుకున్నారు. పేదలకు, యువకులకు సేవలందిస్తున్న జగన్ పేరిట తాని నిస్వార్థంగా సేవలందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయాల్లోకి రావడం, రాకపోవడమనేది జగన్ వ్యక్తిగత విషయమని, ఈ విషయంలో తాను ఏమీ చెప్పలేనని ఆయన అన్నారు. జగన్ ను ప్రశంసలతో ముంచెత్తుతూ పలువురు టీవీ చానెళ్లకు ప్రకటనలిచ్చారు.












Click it and Unblock the Notifications
