పాక్ లో ఆత్మాహుతి దాడి: 54 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తానులోని సర్ చద్దా జిల్లాలోని పెషావర్ సమీపంలోని ఒక మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈద్ ప్రార్థనలు జరుగుతుండగా సంభవించిన ఈ దాడిలో 54 మంది మృత్యువాత పడ్డారు. మాజీ మంత్రి అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఒక తీవ్రవాది తనను తాను పేల్చుకోవడం ద్వారా ఈ దాడికి పాల్పపడ్డాడు. దాడి నుంచి అహ్మద్ ఖాన్ సురక్షితంగా బయట పడ్డాడు. అయితే ఆయన బంధువులు పలువురు గాయపడ్డారు.
దాడిలో అహ్మద్ ఖాన్ కుమారుడు, అల్లుడు గాయపడ్డారు. గాయపడినవారిని తోటి భక్తులు హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధం చేసి సాక్ష్యాలు సేకరిస్తున్నారు. అఫ్తాద్ అహ్మద్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం ఇది రెండోసారి. ఏప్రిల్ 28వ తేదీన జరిగిన దాడిలో 28 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ఆ సమయంలో స్వల్ప గాయాలతో అఫ్తాబ్ బయట పడ్డారు.












Click it and Unblock the Notifications
