తెలంగాణపై నేను పదే పదే మాట్లాడను: వైఎస్
న్యూఢిల్లీ : తెలంగాణాపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీదేనని దానిపై తాను పదే పదే మాట్లాడనని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణా విషయంలో కాంగ్రెస్‌లోని అందరు నాయకులు సోనియా నిర్ణయానికే కట్టుబడి ఉంటారని అందువల్ల ఆ విషయంపై ఎవరూ వ్యాఖ్యానించదలచుకోలేదని ఆయన అన్నారు.
న్యూఢిల్లీలో గురువారం అంతర్గత భద్రతపై జరిగిన సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి అక్కడి ఆంధ్రప్రదేశ్ భవన్లో విలేఖరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణా అంశం ప్రస్తావనకు రాగా ఆయన పై విధంగా స్పందించారు.
వైఎస్ అభిప్రాయాన్ని ఆయన ప్రక్కనే కూర్చున్న పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి కూడా సమర్ధించారు. తెలంగాణా అంశంలో తామంతా సోనియాగాంధీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామన్నారు. అందుకే ఎవరు కూడా ఈ విషయంపై మాట్లాడదల్చుకోలేదని అన్నారు.












Click it and Unblock the Notifications
