ఎప్పటికీ సిఎంను నేనే: నరేంద్ర మోడి
అహ్మదాబాద్: తాను 2001 నుంచే కాదు ఎప్పటినుంచో ముఖ్యమంత్రిని అని, ఎప్పటికీ గుజరాత్ ముఖ్యమంత్రి తానేనని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అన్నారు. సీఎం అంటే కామన్‌మ్యాన్ అని సరికొత్త భాష్యం చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విదుదలవ్వడం మొదలైన తర్వాత మొదటిసారి ఆదివారంనాడు నరేంద్రమోడి తన ప్రతిస్పందనను తెలియజేశారు. నరేంద్రమోడీ ఆథ్వర్యంలో గుజరాత్‌లో బీజేపీ మూడింట రెండు వంతుల మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది.
గుజరాత్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించారు. బిజెపి నేత కేశూబాయ్ పటేల్ అసమ్మతి కూడా పని చేయలేదు. ఎన్నికల ప్రచారంలో మోడీ అసమ్మతి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాజా సమాచారం ప్రకారం మొత్తం 182 స్థానాలకుగాను భారతీయ జనతా పార్టీ 120 స్థానాల్లోను, కాంగ్రెస్ కూటమి 50 స్థానాల్లో, ఇతరులు ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications