వైజాగ్ రన్ లో ముమ్మైత్ ఖాన్ డ్యాన్స్
విశాఖపట్నం: వైజాగ్ రన్ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో సినీనటి ముమ్మైత్ ఖాన్ ప్రేక్షకులను అలరించారు. ఆమె నృత్యానికి ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ప్రపంచ తెలుగు సమాఖ్య యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం వైజాగ్ రన్ జరిగింది. ఉదయం 7 గంటలకు కాళీమాత ఆలయం నుంచి ఈ రన్ ప్రారంభమై పది కిలోమీటర్ల దూరం సాగింది. ఈ రన్ లో సినీ నటులు రాజశేఖర్, సాయికుమార్, జీవిత, ముమ్మైత్ ఖాన్, హ్యాపీ డేస్ సినిమా నటీనటులు, క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ రన్ లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని, భిన్నంగా ఉండి అలరించిందని ముమ్మైత్ ఖాన్ అన్నారు. ఈ రన్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పట్ల చైతన్యం పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని రాజశేఖర్ అన్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ముమ్మైత్ ఖాన్ నృత్యం చేయగా సాయికుమార్ డైలాగులతో ప్రేక్షకులను అలరించారు. విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది.












Click it and Unblock the Notifications