ప్రధాని తెలంగాణపై అలా అనలేదు: కాకా
హైదరాబాద్: తాను, ఎమ్ సత్యనారాయణ రావు ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసిన మాట వాస్తవమేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు జి. వెంకటస్వామి అంగీకరించారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి వైఎస్ వ్యతిరేకి అన్న మాటలు ప్రధాని అనడం తాను వినలేదని ఆయన అన్నారు.
ఆర్టీసీ చైర్మన్ పదవ్ ఇచ్చినా ఎం సత్యనారాయణ రావు తెలంగాణ వాదాన్ని విన్పిస్తూనే ఉన్నారు. తాను ప్రధానమంత్రిని కలిసినప్పుడు తెలంగాణ ప్రస్తావన వచ్చిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ వ్యతిరేకంగా ఉన్నారని ప్రధాని అన్నారని, ఆ సమయంలో తనతో పాటు కాకా జి వెంకటస్వామి ఉన్నారని ఎమ్మెస్ ఇటీవల ప్రకటించడం సంచలనం సృష్టించింది. వెంకటస్వామి ప్రధాని నోట ఆ మాట వినలేదని ప్రకటించడం ద్వారా వైఎస్ కు తాను ఇంకా విధేయుడినేనని చాటుకున్నారు.












Click it and Unblock the Notifications