గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఎపిపియస్సీ) గ్రూప్ -1, గ్రూప్ -2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ వాయిదా పడింది. ఈ నోటిఫికేషన్ రెండు రోజులు ఆలస్యంగా జారీ అయ్యే అవకాశం ఉంది. గ్రూప్ -1 నోటిఫికేషన్ ను రేపు, గ్రూపు -2 నోటిఫికేషన్ ను ఎల్లుండి జారీ చేయాలని ఎపిపియస్సీ నిర్ణయించింది. అయితే ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో నోటిఫికేషన్ వాయిదా పడిందని సమాచారం.
ఎపిపియస్సీ 4,900కు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే గ్రూప్ -1లో కొత్తగా 19 ఆర్డీవో పోస్టులు, గ్రూప్ -2లో 208 డిప్యూటీ తాహిసల్దార్ పోస్టులు వచ్చి చేరాయి. దీనికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అనుమతి లభించాల్సి ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications