పోలవరంపై హైకోర్టులో రిట్
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని రద్దు చేస్తూ కేంద్ర అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం హైకోర్టులో ఒక రిట్ పిటిషనును దాఖలు చేసింది. ఈ కేసు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
అప్పిలేట్ ఉత్తర్వులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. తాము 1994 నిబంధనల మేరకు నోటిఫికేషన్ ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టామని, ఇప్పుడు అనుమతి రద్దు చేయడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం కూడా పెరుగుతుందని అంటోంది.












Click it and Unblock the Notifications