విద్యార్థులూ మిగిలింది తెలంగాణా ఉద్యమమే:కేసీఆర్
కరీంనగర్: 610 జీవో అమలు కాదని స్పష్టమైనందున తెలంగాణా కోసం ఉద్యమం చేపట్టాల్సిందేనని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రాంత పాలకుల తీరుతో అవి ఎందుకూ కొరగాకుండా పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణా విద్యార్థులకు మిగిలింది ప్రత్యేక తెలంగాణా ఉద్యమమొక్కటే అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
