యుపిఎకు మద్దతు ఉపసంహరణ: మాయావతి
లక్నో: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని ఆలోచిస్తున్నట్లు బహుజన సమాజ్ పార్టీ (బియస్పీ) అధినేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి చెప్పారు. ఈ విషయంపై జనవరి 15వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కాంగ్రెసులోని కొంత మంది పెద్దలు తనను హత్య చేయించడానికి కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
తాము తృతీయ ఫ్రంట్ లో చేరే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. తాము ద్వితీయ ఫ్రంట్ గురించి గానీ, తృతీయ ఫ్రంట్ గురించి గానీ ఆలోచించడం లేదని, తామే ఫస్టు ఫ్రంట్ అని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా సోదరభావాన్ని పెంపొందించే నినాదంతో తాము కేంద్రంలోకి అధికారంలోకి వస్తామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications
