సినీ నటుల మాయలో పడకండి : మాయావతి

బీఎస్పీ అన్ని వర్గాల పేదల కోసం పోరాడుతుందని, అంతేకాని అగ్రవర్ణాలకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. సినీనటులను తమ పార్టీలో స్థానం కల్పించబోమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. సినీ నటుల మాటలు విని వారి వలలో పడవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
అంతేకాకుండా దళిత క్రైస్తవులను ఎస్సీలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బీఎస్పీ పేదల పార్టీ అని, అందువల్ల దేశంలో అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటిస్తామని మాయావతి ప్రకటించింది.
పెట్టబడిదారుల మద్దతు లేకుండా, కేవలం పార్టీ కార్యకర్తల ఆర్థిక సహాయ సహకారాలతో యూపీలో గెలుపొందిన తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు తెలంగాణ కోసం పోరాడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, బీఎస్పీ అధికారం లోకి వస్తే ఖచ్చితంగా ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేస్తామని మాయవతి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
