పాక్ దేశం అత్యంత ప్రమాదకారి: లండన్ పత్రిక

లండన్: పాకిస్థాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశమని లండన్‌కి చెందిన ది ఎకనామిస్ట్ పత్రిక పేర్కొంది. పాకిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ఆధారంగా ఓ కథనాన్ని ప్రచురించిన ఆ పత్రిక పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులకు ఆ దేశ అధ్యక్షుడు ముషారఫే కారణమని ఆరోపించింది.

ముషారఫ్ ఉదాసీనత వల్లే పాక్‌లో తీవ్రవాదం హెచ్చు మీరుతోందని ఆ పత్రిక పేర్కొంది. పాక్ అధ్యక్షుడు ముషారఫ్‌కి ప్రజాస్వామ్యం మీద కాస్త కూడా విశ్వాసం లేదని ఆ పత్రిక ఆరోపించింది. పాకిస్థాన్‌లో జరిగిన ప్రతి బాంబు పేళుడు ముషారఫ్ అసమర్థతకు సంకేతాలని ఆ పత్రిక పేర్కొంది.

ముషారఫ్ ప్రవర్తనలోని ఉదాసీనత వల్లే పాక్ మాజీ ప్రధాని బేనజీర్ హత్య జరిగిందని ఆ పత్రిక తెలిపింది. ప్రస్తుత పరిస్థితిలో ముషారఫ్ తన నిర్థోషిత్వాన్ని చాటుకోవాలంటే ఆయనకు రెండే మార్గాలున్నాయని ఆ పత్రిక పేర్కొంది.

పాక్‌లో తాజాగా జరిగిన బేనజీర్ హత్యపై నిష్పక్షపాత విచారణకు అవకాశం కల్పించడం ఓ మార్గమని ఆ పత్రిక తెలిపింది. అలాగే పాక్ పార్లమెంట్‌కి సకాలంలో శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం మరో మార్గమని ఆ పత్రిక తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+