గ్రేటర్ ఉద్యోగుల హెచ్ ఆర్ ఎ పెంపు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాదులోని ప్రభుత్వోద్యోగులకు ఇంటి భత్యం (హెచ్.ఆర్.ఎ.) పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాదులోని ప్రభుత్వోద్యోగులకు హెచ్చార్యేను 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించడంతో ప్రభుత్వం హడావిడిగా ఆ నిర్ణయం తీసుకుంది.
హెచ్చార్యే పెంపు 2007 నవంబర్ నుంచి అమలులోకి వస్తుంది. నవంబర్, డిసెంబర్ నెలల మొత్తాన్ని జిపిఎఫ్ లో జమ చేస్తారు. గ్రేటర్ హైదరాబాదు ప్రభుత్వోద్యోగుల హెచ్చార్యే 4 వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెరుగుతుంది.












Click it and Unblock the Notifications
