చిరు వ్యాఖ్యలపై జోగయ్య వివరణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామ జోగయ్య గురువారంనాడు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలుసుకున్నారు. చిరంజీవి పార్టీ పెడితే ఆ పార్టీలో తాను చేరతానని చేసిన ప్రకటనపై హరిరామజోగయ్యను వీరప్ప మొయిలీ వివరణ కోరారు. ఆ మేరకు హరిరామజోగయ్య వీరప్ప మొయిలీకీ లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు.
తాను ప్రస్తుతమైతే కాంగ్రెసులో ఉన్నానని, తాను వీరప్ప మొయిలీ స్పందన కోసం చూస్తున్నానని హరిరామజోగయ్య అన్నారు. పార్టీ పెడితే చిరంజీవి ముఖ్యమంత్రి కావడం ఖాయమని హరిరామజోగయ్య అన్నారు.












Click it and Unblock the Notifications
