ఇంత నీచం కాంగ్రెసుకే చెల్లింది: కెసిఆర్

రెండో ఎస్సార్సీకి వ్యతిరేకంగా రేపట్నుంచీ ఆందోళనను దిగనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 16, 17 తేదీల్లో నిరసన ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 24వ తేదీన కరీంనగరులో నిరసనసభ జరుగుతుందని ఆయన చెప్పారు. ఆ తర్వాత విద్యార్థుల కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు. అప్పటికి కూడా దిగిరాకపోతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నమ్మకద్రోహానికి, అబద్ధాలకు, వాస్తవాల వక్రీకరణకు పాల్పపడుతోందని ఆయన విమర్శంచారు. తెలంగాణలో కాంగ్రెస్ పతనం తప్పదని ఆయన అన్నారు. కరీంనగరులో రెండు లక్షలకు పైగా మెజారిటీతో గెలిచామని, ఇంతకన్నా ప్రజాభిప్రాయం ఏముంటుందని ఆయన అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం సాధించలేదనేది నిజం కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ నిజాలను తొక్కి పెడుతోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
