మేమెందుకు నష్టపోవాలి: ఉప్పునూతల
హైదరాబాద్: తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేస్తామంటే ప్రజలు నమ్మబోరని, దీని వల్ల తెలంగాణలో కాంగ్రెసుకు పార్టీకి నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి అన్నారు. తెలంగాణ విషయంలో పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయానికి తామెందుకు నష్టపోవాలని, తాము అధిష్ఠానవర్గాన్ని నిలదీస్తామని ఆయన ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణలో గెలిస్తేనే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పరిస్థితులుంటాయని, తెలంగాణ విషయంలో ఈ విధమైన వైఖరి అవలంబిస్తే నష్టం తప్పదని ఆయన అన్నారు. రెండో ఎస్సార్సీ వేసినా నివేదికకు గడువు పెట్టాలని, ఈ ప్రక్రియ అంతా ఎన్నికలకు ముందే జరిగిపోవాలని, అప్పుడు కొంత ఫలితం ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
