మాటంటే మాటే, లక్షకే కారు: రతన్


ఢిల్లీ: మాటంటే మాటేనని, టాటా - నానో కారును లక్ష రూపాయలకే ఇస్తామని టాటా మోటార్స్ చైర్మన్ రతన్ టాటా స్పష్టం చేశారు. వ్యాట్, ట్రాన్స్ పోర్టు చార్జీలు లక్ష రూపాయలకు అదనంగా పెట్టాల్సి ఉంటుంది. అన్ని రక్షణ పరిమితులను పరిగణనలోకి తీసుకునే ఈ కారును రూపొందించామని ఆయన లక్ష రూపాయల కారును గురువారం ఆవిష్కరిస్తూ చెప్పారు.

తక్కువ పరిమాణం, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం ఈ కారు లక్షణమని, అందుకే నానో అని పేరు పెట్టామని ఆయన చెప్పారు. పర్యావరణ నిబంధనలకు, యూరో 4 నిబంధనలకు అనుగుణంగానే ఈ కారును రూపొందించామని ఆయన చెప్పారు. కారు మైలేజీ లీటరుకు 23 కిలోమీటర్లు అని చెబుతున్నారు. ఇంజన్ సామర్థ్యం 624 సిసి. ఈ కారు నమూనాను తిలకించడానికి ప్రగతి మైదానులో విదేశీ ఏజెంట్లు కూడా ఎగబడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+