లాహోర్ లో పేలుడు: 25 మంది మృతి
లాహోర్: పాకిస్తానులోని లాహోర్ హైకోర్టు సమీపంలో గురువారం జరిగిన బాంబు పేలుళ్లలో 25 మంది మరణించారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది పోలీసులే ఉన్నారు. రద్దీగా ఉండే లాహోర్ హైకోర్టు సమీపంలో ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకుని ఈ విధ్వంసానికి పాల్పడ్డాడు.
ముషార్రఫ్ పాలనకు వ్యతిరేకంగా న్యాయవాదులు ర్యాలీ తీయడానికి సిద్ధపడిన సమయంలో ఈ బాంబు పేలుడు సంభవించింది. ఆత్మాహుతి బాంబర్ పోలీసు భద్రతా గిరి వద్దకు వచ్చి తనను పేల్చుకున్నాడని నగర పోలీసు చీఫ్ మాలిక్ ఇక్బాల్ చెప్పారు. పేలుడు సంభవించిన స్థలానికి పలు మీటర్ల దూరానికి శవాలు ఎగిరిపడ్డాయి. నిరసన ర్యాలీకి ముందు పేలుడు సంభవించిన సమయంలో లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషన్ సమావేశం జరుగుతోంది. పేలుడులో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.












Click it and Unblock the Notifications
