లక్ష కారును ఆవిష్కరించిన టాటా


ఢిల్లీ: ఢిల్లీలోని ప్రగతి మైదానులో లక్ష రూపాయల కారు నమూనాను టాటా మోటార్స్ చైర్మన్ రతన్ టాటా గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు ఆవిష్కరించారు. ప్రగతి మైదానులో ఆటో ఎక్స్ పో - 2008లో ఆయన ఈ కారును ఆవిష్కరించారు. ఈ కారును చూడడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. తోపులాట కూడా చోటు చేసుకుంది. సెక్యూరిటీ సిబ్బందితో ప్రజలు గొడవ పడ్డారు.

ఈ ఏడాది సెప్టెంబరులో లక్ష రూపాయల కారును టాటా మోటార్స్ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ కారుకు టాటా- నానోగా నామకరణం చేశారు. దీన్ని 30 లీటర్ల పెట్రోల్ పట్టేలా రూపొందించారు. లక్ష రూపాయల కారును రతన్ టాటా నడుపుకుంటా వచ్చారు. పసుపు, ఎరుపు, తెలుపు రంగుల్లో ఈ కారును విడుదల చేస్తారు. దేశంలోని మధ్యతరగతివారికి అందుబాటులో ఉండేలా దీని ధరను నిర్ణయించి అందుకు అనుగుణంగా రూపొందించారు. ఈ కారు ఇంజన్ సామర్థ్యం 600 సిసి. ఈ కారు ఆవిష్కరణతో టాటా మోటారు షేర్లు నాలుగు శాతం పెరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+