తెరాసకు కూడా బాధ్యత: దత్తాత్రేయ
విశాఖపట్నం: తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలని కాంగ్రెస్ ఆలోచించడం పచ్చి మోసమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వబోదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ విషయాన్ని తాము తెలంగాణ రాష్ట్ర సమితితో కూడా చెప్పామని, ఆ పార్టీ అప్పుడు గమనించలేదని, ప్రస్తుత స్థితికి తెరాస కూడా బాధ్యత వహించాలని ఆనయ అన్నారు.
తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేస్తామనడం నాటకమని ఆయన అన్నారు. మూడు నాలుగేళ్లు కాలయాపన చేసి ఇప్పుడు రెండో ఎస్సార్సీ వేస్తామనడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీకే కట్టుబడి ఉంటే రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ఎందుకు చేర్చారని, ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఎందుకు వేశారని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications
