వైయస్ శకుని పాత్ర: దత్తాత్రేయ
హైదరాబాద్: తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శకుని పాత్ర పోషిస్తున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. తెలంగాణకు వైయస్ రాజశేఖర రెడ్డే అడ్డు పడుతున్నారని, రాజశేఖర రెడ్డి కాకుండా ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయి వుంటే తెలంగాణ ఎప్పుడో వచ్చి ఉండేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిజెపి బుధవారం మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ముఖ్యమంత్రినే తప్పు పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డిని కాపాడుకుంటారో, పార్టీని కాపాడుకుంటారో కాంగ్రెస్ నాయకత్వం తేల్చుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణపై తన వైఖరిని ప్రకటించాలని ఆయన కాంగ్రెస్ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని తన లేఖలో రాసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications