షబ్బీర్ కు జవాబా: మధుయాష్కీ
న్యూఢిల్లీ: మంత్రి షబ్బీర్ అలీకి జవాబు చెప్పాల్సిన అవసరం తనకు లేదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఏం మాట్లాడాలో షబ్బీర్ అలీ నుంచి తాను నేర్చుకోవాల్సిన అవసరం లేదని, ఏం మాట్లాడాలో తనకు తెలుసునని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలోమిటో షబ్బీర్ అలీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తెలంగాణపై పార్టీ అధిష్ఠానవర్గానికి తప్పుడు సంకేతాలు పంపుతున్నారని, ప్రజల మనోభావాలను అధిష్ఠానవర్గానికి తెలియజేయాల్సిన అవసరం తమకు ఉందని ఆయన అన్నారు. సోనియా గాంధీ పార్టీ సుప్రీం నాయకురాలని, సోనియాను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని, ఆమెనే ప్రశ్నించే స్థాయికి వెళ్లారని ఆయన అన్నారు. అలా మాట్లాడే వారి గురించి పార్టీ అధిష్ఠానవర్గం చూసుకుంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications