మధుయాష్కీకి షబ్బీర్ చురకలు
హైదరాబాద్: తమ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ తన స్థాయిని మర్చి మాట్లాడుతున్నారని తెలంగాణకు చెందిన రాష్ట్ర విద్యుచ్ఛక్తి మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. తెలంగాణపై తాను చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వివరణ ఇచ్చిన తర్వాత కూడా కొందరు తెలంగాణ నాయకులు వేరే ఉద్దేశంతో విమర్శలు చేస్తున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
కాంగ్రెస్ వారి జాగీరు కాదని, సొంత ఎజెండాతో పార్టీకి నష్టం చేస్తుంటే సహించేది లేదని ఆయన తెలంగాణవాదం వినిపిస్తున్న కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి అన్నారు. తమ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications