బిసిలకు 33 శాతం సీట్లు: టిడిపి
వరంగల్: చట్టసభల్లో పార్టీపరంగా వెనకబడిన కులాలకు (బిసిలకు) 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. వరంగల్లులో బిసి గర్జన జరగడానికి ముందు బుధవారం ఉదయం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. తాము అధికారంలోకి వస్తే బిసిలకు బడ్జెట్టులో 2 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని, బిసి సంక్షేమానికి మరో 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
బిసిలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికపై బిసిలకు నిధులు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి బిసికి 3 సెంట్ల భూమి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది. బిసి గర్జన కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హైదరాబాదు నుంచి ర్యాలీగా వరంగల్లు చేరుకున్నారు. అనంతరం ఆయన పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications