తెలంగాణపై తేల్చాల్సిందే: కాకా
న్యూఢిల్లీ: తెలంగాణ ఇస్తారా, లేదా అని తమ పార్టీ అధిష్ఠానవర్గం తేల్చాల్సిందేనని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి. వెంకటస్వామి అన్నారు. అధిష్ఠానవర్గంతో చర్చించేందుకు వెంకస్వామి, మధుయాష్కీ, సర్వే సత్యనారాయణ తదితరులు బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలవడానికి ముందు వారు వెంకటస్వామి నివాసంలో సమావేశమయ్యారు. తెలంగాణపై ముఖ్యమంత్రి తన వైఖరిని బయట పెట్టారు కాబట్టి తెలంగాణ ఇవ్వాల్సిందేనని వెంకటస్వామి అన్నారు. తెలంగాణపై చర్చించేందుకు సిడబ్ల్యుసి సమావేశం ఏర్పాటు చేయాలని తాను సోనియాకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.
వైయస్ రాజశేఖర రెడ్డికి రెండో సారి ముఖ్యమంత్రి కావాలని ఉందని, అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పడానికే తాము ఢిల్లీ వచ్చామని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటన నేపథ్యంలో దుమారం చెలరేగడంతో కాంగ్రెస్ కోర్ కమిటీ మంగళవారం అర్థ రాత్రి సమావేశమైంది. ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానవర్గం వెంకటస్వామికి ఢిల్లీకి రావాలని ఆహ్వానం పంపింది.












Click it and Unblock the Notifications